గుమ్మడి గింజలతో ఇన్నిఆరోగ్య ప్రయోజనాలా.?

- November 14, 2023 , by Maagulf
గుమ్మడి గింజలతో ఇన్నిఆరోగ్య ప్రయోజనాలా.?

హిందూ సనాతన ధర్మంలో గుమ్మడి కాయకు ప్రత్యేకమైన పవిత్ర స్థానం వుంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో గుమ్మడి కాయను ప్రత్యేకంగా వినియోగిస్తుంటారు.

అయితే, గుమ్మడికాయను ఆహారంలో తీసుకోవడం మాత్రం చాలా అరుదుగా చేస్తుంటారు. కొంతమంది మాత్రమే గుమ్మడిని ఆహారంలో వినియోగిస్తుంటారు.

కానీ, గుమ్మడి కాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు గుమ్మడి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో వుంటాయ్.

గుమ్మడి కాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పుల్ని తగ్గించే శక్తిని కలిగి వున్నాయ్. అలాగే, క్యాన్సర్ కోసం వినియోగించే మందుల్లోనూ గుమ్మడి గింజల్ని వినియోగిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో గుమ్మడి గింజలు తోడ్పడతాయ్. అందుకే గుమ్మడి గింజల్ని గ్రేవీల కోసం కూరల్లో వినియోగించడం మంచదని నిపుణులు చెబుతున్నారు.

ఇంకెందుకాలస్యం.. ఇక నుంచి గుమ్మడితో పాటూ, గుమ్మడి గింజల్నీ వంటకాల్లో భాగం చేసుకోండిక.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com