గర్భిణులు వాల్ నట్స్ తినకూడదా.?
- November 15, 2023
వాల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయ్. ఇందులోని యాంటీ ఆక్సీడెంట్లు ఏకంగా ప్రాణాంతక వ్యాధులను సైతం నివారించగల శక్తిని కలిగి వుంటాయ్.
అలాగే, శరీరంలోని మెటబాలిక్ రేటును క్రమబద్ధీకరించడంలోనూ వాల్ నట్స్ చాలా ఉపకరిస్తాయ్. వాల్ నట్స్‌ని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు తగ్గుతారు.
అయితే, గర్భిణీ స్త్రీలు వాల్ నట్స్ తినకూడదన్న అపోహ వుంది. కానీ, గర్భిణీ స్త్రీలు సైతం వాల్ నట్స్ తినొచ్చని.. అది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ తినడం వల్ల లోపల వున్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు రాకుండా.. పూర్తి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుందని తాజా సర్వేలో తేలింది.
అలాగే, తల్లీ బిడ్డ ఆరోగ్యానికి వాల్ నట్స్ చాలా సహకరిస్తాయ్. రోజూ నాలుగైదు నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడంతో పాటూ, ప్రసవం తర్వాత తల్లి కూడా ఆరోగ్యంగా వుంటుంది.
ఇక, వాల్ నట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తిని తగ్గించే హానికరమైన ప్రీ రాడికల్స్ నాశనమవుతాయ్. తద్వారా మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







