మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్‌గా.?

- November 15, 2023 , by Maagulf
మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్‌గా.?

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమా ఇటీవల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సాయి ధరమ్ తేజ్ సిద్ధం చేసి పెట్టాడు.

అందులో ఒకటి మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పక్కా మాస్ గెటప్‌లోకి మారిపోనున్నాడట తేజు. అలాగే, సినిమాకి సంబంధించి ఓ ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది తాజాగా.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఈ మధ్య మెగా కాంబో మూవీస్ బాగానే తెరకెక్కుతున్నాయ్. అయితే, ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నాయ్. ‘ఆచార్య’ ఆ కోవలో మొదటి స్థానంలో వుంది.

‘బ్రో’ హిట్టంటే హిట్టు.. ఫట్ అంటే ఫట్టు. మరి ఈ నేపథ్యంలో చిరు, తేజు కాంబో ఎలా వర్కవుట్ అవుతుందో.! అయితే, చిరంజీవి వెరీ షార్ట్ రోల్‌లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రలో నటించబోతున్నారీ సినిమాలో అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com