ప్రపంచకప్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ..!
- November 16, 2023
న్యూ ఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. వరుస విజయాలు సాధిస్తూ టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
ఆదివారం (నవంబర్ 19)న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. 1,32,000 ఈ స్టేడియం కెపాసిటీ. కాగా.. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
టీమ్ఇండియాకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని..వాంఖడే వేదికగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీమ్ఇండియా ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 'భారత జట్టుకు అభినందనలు. అత్యుత్తమ ప్రదర్శనతో విశేషమైన శైలిలో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు మ్యాచ్‌ను అందించింది. ఫైనల్ మ్యాచ్‌కు శుభాకాంక్షలు.'అని ప్రధాని మోదీ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







