త్వరలో తిరుపతి టూ దుబాయ్, అమెరికా విమాన సేవలు
- May 25, 2016
తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజించిన తర్వాత ఏపీ అభివృద్ది కోసం కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా ఏపీ ప్రజలకు మరో శుభవార్త..! తిరుపతి ఏర్ పోర్ట్ నుంచి ఇక అంతర్జాతీయ సర్వీసులు మొదలుకాబోతున్నాయ్. ఇక్కడి నుంచి అమెరికా,దుబాయ్ చుట్టి రావచ్చు.ప్రస్తుతానికి ఈ సర్వీసులను న్యూఢిల్లీ మీదుగా అమెరికా, దుబారు, మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు.
దుబాయ్ తోపాటు మిగతా గల్ఫ్ దేశాలకి రాయలసీమ నుంచి రాకపోకలు చాలా ఎక్కువ. వాళ్లంతా ఇప్పటి వరకూ వయా హైద్రాబాద్ వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడిక ఆ అవసరం లేదు. అటు అమెరికా వెళ్లేందుకు ఇక తిరుపతే హెడ్ క్వార్టర్స్ వస్తుందని అంటున్నారు. ఇక ఫ్యూయెల్ ఛార్జీలు పెరిగి, మెయింటెనెన్స్ కష్టం కావడంతో మన దేశంలో కూడా ఏర్ వేస్ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ఇంధన, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులశాఖ ముఖ్య కార్యదర్శి అజరుజైన్ వెల్లడించారు.
ప్రస్తుతానికి ఈ సర్వీసులను న్యూఢిల్లీ మీదుగా అమెరికా, దుబారు, మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. అంతర్జాతీయ సర్వీసులు. సేవల్లోనూ క్వాలిటీ ఏపీవైపు వస్తోంది. విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి లాంటి ఏర్ పోర్ట్ లన్నీ త్వరలోనే మరింత గ్రోత్ చూడబోతున్నాయని ఏపీ లెక్కేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







