భారీగా తగ్గినా పసిడి ధర
- May 25, 2016
పసిడి ధర వరసగా రెండో రోజూ తగ్గి ఆరు వారాల కనిష్ఠానికి చేరింది. బుధవారం రూ.70 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,200కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరగకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.71శాతం తగ్గి 1,226.90 యూఎస్ డాలర్లుగా ఉంది. అలాగే వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ.50 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.39,450కి చేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







