భారీగా తగ్గినా పసిడి ధర

- May 25, 2016 , by Maagulf
భారీగా తగ్గినా పసిడి ధర

పసిడి ధర వరసగా రెండో రోజూ తగ్గి ఆరు వారాల కనిష్ఠానికి చేరింది. బుధవారం రూ.70 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,200కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరగకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.71శాతం తగ్గి 1,226.90 యూఎస్‌ డాలర్లుగా ఉంది. అలాగే వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ.50 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.39,450కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com