సీబీఆర్ఎన్ ఎమర్జెన్సీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమానాశ్రయం
- November 20, 2023
హైదరాబాద్: కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సీబీఆర్ఎన్) ఎమర్జెన్సీ మేనేజ్మెంట్పై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ డి ఎం ఎ) తో కలిసి 2023 నవంబర్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సిబిఆర్ఎన్ అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడంలో ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ హ్యాండ్లర్ల సంసిద్ధతను పెంపొందించడం, విమానాశ్రయ వాతావరణంలో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ సరుకులతో కూడిన సంభావ్య ముప్పులను ఎదురుకోవడం పై ప్రాథమిక శిక్షణ లక్ష్యం.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సీఇఓ ప్రదీప్ పణికర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ డి ఎం ఎ నుంచి సీబీఆర్ ఎన్ శిక్షణ నోడల్ ఆఫీసర్, కన్సల్టెంట్ (న్యూక్లియర్ అండ్ రేడియాలాజికల్), డి సుందర్ మరియు సీనియర్ కన్సల్టెంట్ ఎస్.కె.ఘోష్ తో పాటు జిహెచ్ ఐఎఎల్ సీనియర్ అధికారులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షణలో ఉపన్యాసాలు, క్షేత్ర వ్యాయామాలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు గుర్తింపు మరియు నిర్మూలన విధానాలపై దృష్టి సారించాయి. సిబిఆర్ఎన్ అత్యవసర పరిస్థితులను నిర్వహించే నైపుణ్యాలతో అత్యవసర హ్యాండ్లర్లను సన్నిద్ధం చేయడంతో పాటు, ప్రథమ వైద్య చికిత్స మరియు ప్రారంభ మానసిక-సామాజిక మద్దతును అందించడానికి వీలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్), న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ), అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎస్డీఎంఏ), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు రోజున జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) మాక్ డ్రిల్ మరియు ప్రదర్శన, తరువాత క్విజ్, ఫీడ్బ్యాక్ సెషన్, మూల్యాంకనం మరియు డీబ్రిఫ్ ఉంటాయి. పూర్తికాగానే అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 36 మంది సిబ్బంది సీబీఆర్ ఎన్ ఎమర్జెన్సీలకు సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ పొందనున్నారు.
ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్ద ప్రమాదకరమైన మెటీరియల్ దుర్వినియోగం లేదా ఒలికిపోయిన సందర్భాల్లో ఎయిర్పోర్ట్ ఆపరేటర్ గా జిహెచ్ ఐఎఎల్ మొదటి ప్రతిస్పందనగా కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్ జిఐఎలో ఏదైనా విపత్తు పరిస్థితిని నిర్వహించడానికి మరియు తగ్గించడానికి ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ (ఎఆర్ఎఫ్ఎఫ్) బృందంలో ప్రమాదకరమైన వస్తువులను నిర్వహించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది రేడియోధార్మిక, మండే స్వభావం, పేలుడు, తుప్పు పట్టించగలిగే, ఆక్సీకరణ, ఊపిరాడకపోవడం, జీవ-ప్రమాదకరమైన, విషపూరిత, వ్యాధికారక లేదా అలెర్జీ కలిగించే పదార్థాలని నిర్వహించే సామధ్యం కలిగి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..