అంతరించిపోతున్న 85 జంతువులను విడుదల చేసిన ప్రిన్స్ సల్మాన్
- November 20, 2023
రియాద్: రాయల్ రిజర్వ్ సహకారంతో, నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ వద్ద ఆదివారం 2023-2024 సీజన్ ప్రారంభానికి గుర్తుగా అంతరించిపోతున్న 85 జంతువుల మొదటి బ్యాచ్‌ను ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విడుదల చేశారు. అంతరించిపోతున్న వన్యప్రాణులను పెంపొందించడం , పర్యావరణ వ్యవస్థలను పునర్నిర్మించడం, సౌదీ అరేబియాలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం కోసం అంకితం చేయబడిన కేంద్రం చొరవలో భాగంగా జంతువులను విడుదల చేశారు. విడుదలైన జంతువులలో 20 అరేబియన్ ఒరిక్స్, 40 రిమ్ జింకలు, ఆరు పర్వత గజెల్స్, ఆరు ఆల్పైన్ ఐబెక్స్‌లు, అలాగే షెల్టర్ యూనిట్ నుండి పునరావాసం పొందిన పక్షుల సమూహాలు ఉన్నాయి. ఈ కేంద్రం జంతువులు, పక్షుల జీవన స్థితిగతులపై విస్తృతమైన పరిశోధనలు నిర్వహిస్తుంది. రక్షిత ప్రాంతాలలో వన్యప్రాణుల సమూహాలను పర్యవేక్షించడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తుంచి డేటాను సేకరిస్తుంది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







