ఎన్టీఆర్, హీరోగా 15 ఏళ్ల కెరీర్ ..
- May 25, 2016
టాలీవుడ్ లో స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, హీరోగా 15 ఏళ్ల కెరీర్ ను పూర్తిచేసుకున్నాడు. 2001 మే 25న రిలీజ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తొలిసారిగా వెండితెర మీద దర్శనమిచ్చిన జూనియర్, ఆ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్ వన్' ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పింది.ఆ సినిమా సక్సెస్ తో ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో తిరిగులేని మాస్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీకి నవతరం వారసుడిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకొని యంగ్ జనరేషన్ లో టాప్ హీరోగా ఎదిగాడు. మధ్యలో చాలాసార్లు కెరీర్ పరంగా తడబడినా తాజాగా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్ లతో తిరిగి ఫాంలోకి వచ్చాడు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వలో జనతా గ్యారేజ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







