బన్నీ, ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో ..!
- May 25, 2016
తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు బిగ్గెస్ట్ హిట్ సినిమాలు అందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మెగా కుర్రోడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి 'సరైనోడు' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందించారు. మొదట ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత భలే పుంజుకుంది. అంతే కాదు అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా నిలిచిపోయింది. ఇక ఇదే ఊపుపై బోయపాటి శ్రీను ఓ మల్టీ స్టారర్ చిత్రం తీయబోతున్నారట. ఆ చిత్రంలో అల్లు అర్జున్-ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారు.అసలు విషయం ఏమిటంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో వీళ్లిద్దరూ గెస్ట్ రోల్స్ ప్లే చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. వాస్తవానికి ఈ సినిమా కథలో మంచి గ్రిప్ ఉన్నప్పటికీ సినిమాకు హైప్ క్రియేట్ అవ్వాలంటే వీళ్లద్దరూ సినిమాలో కనిపించాల్సిందేనని బోయపాటి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ఇక ఈ గెస్ట్ రోల్స్ కి మంచి అప్పిరియన్స్ తీసుకు రావడానికి స్ర్కిప్ట్ లో మార్పులు.. చేర్పులు చేస్తున్నాడట బోయపాటి. గెస్ట్ రోల్ చేయనున్న ఇద్దరు హీరోల పేర్లను బోయపాటి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాడని సమాచారం.ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేశారు. జూలైలో సినిమా ప్రారంభించాలని భావిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ ఈ చిత్రాని నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







