యూఏఈ గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
- November 21, 2023
యూఏఈ: గల్ఫ్ సేన జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీం ఆధ్వర్యంలో అల్ అయిన్ లో జరిగిన మెగా రక్తదానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా హాజరైన జనసైనికులు మరియు వీర మహిళలు దాదాపు 70 కి పైగా మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల జనసేన ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు మరియు జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మొగళ్ల్ల రక్తదానం చేసిన జనసైనికులకు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు మరియు జనసేన పార్టీ నుండి వారికి అభినందన పత్రం అందజేశారు. అలాగే రక్త దానం చేసిన వారిని ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు అభినందించారు.జనసేన పార్టీ 2024 లో గెలుపు కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యకర్తలకు వివరించారు. అలాగే డిసెంబర్10న జరిగే గల్ఫ్ జనసేన పోస్టర్ ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి