తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఖరారు

- November 21, 2023 , by Maagulf
తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 22), ఎల్లుండి (నవంబర్ 23) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి మద్దతు తెలుపుతుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ..బిజెపి , జనసేన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.

రేపు , ఎల్లుండి పవన్ కళ్యాణ్ వరంగల్ , కొత్తగూడెం , సూర్యాపేట , దుబ్బాక లలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను జనసేన పార్టీ అధికారికంగా విడుదల చేసింది. రేపు (నవంబర్ 22) ఉదయం 11 గంటలకు కొత్తగూడెం లో జరిగే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సభలో పాల్గొంటారు. ఎల్లుండి (నవంబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట లో జరగబోయే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 : 30 కు దుబ్బాక లో జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com