అయ్యో పాపం బాలయ్య.! అలా టార్గెట్ అయిపోయావేంటయ్యా.!

- November 22, 2023 , by Maagulf
అయ్యో పాపం బాలయ్య.! అలా టార్గెట్ అయిపోయావేంటయ్యా.!

రీసెంట్‌గా తమిళ నటుడు త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే, తాజాగా మరో తమిళ నటి మన తెలుగు స్టార్ హీరో బాలకృష్ణపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.

ఆమె ఎవరో కాదు, గతంలో బాలకృష్ణ‌తో కలిసి నటించిన ముద్దుగుమ్మ సుచిత్ర. ‘భలేవాడివి బాసూ’ అనే సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన ఈ హీరోయిన్, ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన చేదు అనుభవాల్ని మీడియా ముందుంచేసింది.

ఓ తెలుగు స్టార్ హీరో అప్పట్లో తనను రూమ్‌కి రమ్మన్నారనీ నిరాకరించినందుకు సినిమా యూనిట్ తనతో అసభ్యంగా ప్రవర్తించిందనీ, డైరెక్టర్‌కి కంప్లైంట్ చేసినా ఉపయోగం లేదనీ చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ర్టీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణం అని ఆమె అభివర్ణించింది. హీరోయిన్‌గా తాను చాలా హెరాస్‌మెంట్స్‌కి గురయ్యాననీ, తనలా చాలా మంది బాథితులున్నారనీ ఆమె ఆరోపించింది.

దాంతో, బాలయ్య గతంలో ఓ సినిమా కార్యక్రమం సందర్భంగా అమ్మాయి కనిపిస్తే రేప్ చేసేయాలి.. లేదంటే కడుపైనా చేసేయాలి.. అంటూ చేసిన వ్యాఖ్యల్ని అందుకు సంబందించిన వీడియోల్ని వెలికి తీసి మరీ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. అయ్యో పాపం.! బాలయ్య ఇలా ఇరికేశాడేంటీ.! అనుకోవడం తప్ప ఈ విషయానికి సంబందించి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి.!  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com