బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్‌ని ప్రారంభించిన మొహమ్మద్
- May 25, 2016
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ, మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ - బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్‌ని ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో నిర్మించిన భారీ నిర్మాణాల సముదాయమిది. అత్యద్భుతమైన హాస్పిటాలిటీ ఈ బుర్జ్ అల్ అరబ్ టెర్రాస్ సొంతం. దుబాయ్ హోల్డింగ్ మెంబర్ అయిన గ్లోబల్ లగ్జరీ హోటల్ కంపెనీ జుమైరా గ్రూప్ ఈ బుర్జ్ అల్ అరబ్‌ని నిర్వహిస్తోంది. దుబాయ్ ల్యాండ్ మార్క్‌గా ఈ బుర్జ్ అల్ అరబ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోనుంది. టెర్రాస్‌ని బుర్జ్ అల్ అరబ్ ప్రతిబింబంలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, ఈ కాన్సెప్ట్‌ని అభినందించారు. ఈ తరహా క్రియేటివిటీతో కూడిన నిర్మాణాలనీ, హాస్పిటాలిటీనీ యూఏఈ మరియు దుబాయ్ ప్రోత్సహిస్తూనే ఉంటాయని చెప్పారాయన. 5000 టన్నుల కృత్రిమ ద్వీపాన్ని ఫిన్‌లాండ్‌లోని షిప్‌యార్డ్ సైట్‌లో నిర్మించి, దాన్ని బఎనిమిది భాగాలుగా దుబాయ్‌కి షిప్పింగ్ చేశారు. దుబాయ్ హోల్డింగ్ వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ బియాత్, షేక్ మొహమ్మద్ సపోర్ట్‌ని కొనియాడారు. సరికొత్త ఆవిష్కరణలకు షేక్ మొహమ్మద్ ఇస్తున్న సపోర్ట్ మరువలేనిదని ఆయన చెప్పారు. హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో దూసుకపోవడమే కాకుండా, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







