బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ప్రజలు తరిమికొడతారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- November 26, 2023
హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టనున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాచిగూడ లింగంపల్లిలోని వినాయక ఆలయం నుంచి రోడ్‌షో నిర్వహించారు. సి.కృష్ణాయాదవ్, ఎన్.గౌతమ్‌రావు, కార్పొరేటర్లు క న్నె ఉమాదేవి, వై.అమృత రోడ్‌షో నిర్వహించారు. యువమోర్చా కార్యకర్తలు జీపు వెంట బైక్‌లపై ర్యాలీగా వెళ్లారు. కన్నె రమేష్‌యాదవ్, ఎక్కాల నందు, నందకిషోర్‌యాదవ్, సి.వినోద్‌యాదవ్, దడిగె జగన్యాదవ్, ఏ.సూర్యప్రకా్‌షసింగ్, ఎడెల్లి అజయ్‌కుమార్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి, కృష్ణాయాదవ్ అన్నారు. గోల్నాక రోడ్‌లోని సల్వా గార్డెన్ ఫంక్షన్హాల్లో కుట్టుమిషన్ కార్మికుల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల మెగ్గుచూపుతున్నారని తెలిపారు. సమ్మేళనంలో క్షీర్సాగర్, కృష్ణ, శ్రీను, వెంకటేష్, అరవింద్, గోవింద్, శ్రీనివాస్, నరేందర్, సుబ్రహ్మణ్యం, అర్చన, లావణ్య, ఈశ్వరి, నిర్మల, గీ, రేఖ, బీజేపీ డివిజన్ కన్వీనర్ మూల రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







