తన భార్యకి డెలివరీ చేశాడని డాక్టర్‌ని కాల్చేశాడు
- May 26, 2016
సౌదీకి చెందిన ఓ వ్యక్తి, తన భార్యకు మేల్ డాక్టర్ డెలివరీ చేశాడన్న కారణంగా, ఆ డాక్టర్‌పై కాల్పులు జరిపాడు. సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీ ఆసుపత్రిలో డాక్టర్ ముహన్నద్ అల్ జబ్‌న్ అనే డాక్టర్, ఓ మహిళకు డెలివరీ సమయంలో సహాయం అందించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ మహిళ భర్త, తాను డాక్టర్‌ని కలిసి అభినందనలు తెలుపుతానంటూ ఆసుపత్రికి వచ్చాడు. ఇద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలో కాస్సేపు మాట్లాడుకున్నారు. ఇంతలో నిందితుడు, గన్ తీసి డాక్టర్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే అక్కడున్న ఇతర డాక్టర్లు, గాయపడ్డ డాక్టర్‌కి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనకు శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు. ఇంకో వైపున నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాధిత డాక్టర్ పట్ల సర్వత్రా సంఘీభావం వ్యక్తమవుతోంది. అలాగే, మహిళా డాక్టర్‌ని వినియోగించాల్సిన సందర్భంలో మేల్ డాక్టర్‌ని వినియోగించడంతోనే ఈ సమస్య వచ్చిందని కూడా నెటిజన్లు తమ స్పందనను తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







