ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్..

- November 28, 2023 , by Maagulf
ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్..

హైదరాబాద్: హైదరాబాద్ ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మాములుగా ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు కురిపిస్తుంటారు..ప్రచారంలో ఓటర్లకు కావాల్సినవి ఇచ్చి ప్రసన్నం చేసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ర్యాపిడో బంపర్ ఆఫర్ తెలిపి..హైదరాబాద్ ఓటర్లలో సంతోషం నింపింది. ఎల్లుండి తెలంగాణ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ వాసులు.. తమ తమ సొంతూళ్లకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు.

ఇక మహానగరంలో ఓటర్లు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వియోగించుకోవాలని చుస్తునారు. ఈ నేపథ్యంలో ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 30వ తేదీన ఓటు వేసేవారిని ఉచితంగా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాపిడో వెల్లడించింది. ఎన్నికల రోజున హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ కేంద్రాలకు ఉచిత రైడ్‌ల సదుపాయం కల్పిస్తున్నట్లు రాపిడో ప్రకటించింది.

ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని సంస్థ కోరింది. ఐటి ఉద్యోగులు మొదలు, రూట్ తెలియని వారు, బస్సు సదుపాయం లేని వారు, సొంత వాహనాలు లేని వారు…ఇలా అనేక మంది ర్యా పిడో ను ఉపయోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో అధికంగా పోలింగ్ శాతం నమోదు కావడమే లక్ష్యంగా ఫ్రీ రైడ్ ఆఫర్ చేస్తున్నట్లు ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండపల్లి తెలిపారు. నగరంలో ఫ్రీ రైడ్ నిర్ణయం ద్వారా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంటే గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం 55 శాతానికి పోలింగ్‌ మించడం లేదని, అందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే సిద్ధంగా ఉంటారని, ఓటర్లు రైడ్ కోరిన వెంటనే వారిని పోలింగ్ కేంద్రాల వద్ద ఉచితంగా దిగబెడతారని సంస్థ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com