ఢిల్లీ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆరేళ్ల బాలుడు మృతి
- November 28, 2023
న్యూఢిల్లీ: గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి, అరుదుగా మధ్యవయస్కులకు మాత్రమే వచ్చేది. గుండె పోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా పెద్ద వయస్కులదే ఎక్కువగా ఉండేది. అయితే, మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లతో ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో చేరుతున్న వారు కొందరైతే, కొంతమంది మాత్రం స్పాట్ లోనే కన్నుమూస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ ఆరేళ్ల బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్సతో కోలుకున్నట్లే కోలుకున్న బాలుడు.. తర్వాత మరోమారు జబ్బుబారిన పడ్డాడు. ఈసారి ఆసుపత్రిలో చేరి ఇంటికి తిరిగిరాలేదు. ఆ బాలుడి మరణానికి కారణం గుండెపోటేనని వైద్యులు నిర్ధారించారు. రక్త పరీక్షలో బాబు మయోకార్డిటిస్ వైరస్ బారిన పడినట్లు తేలిందన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బిజినెస్ మ్యాన్ రాహుల్ జైన్ కు ఒక్కడే కొడుకు.. ఆరేళ్ల విహాన్ జైన్ ఇండోర్ లోని ఓ కార్పొరేట్ స్కూలులో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇటీవల విహాన్ అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించడంతో కోలుకున్నాడు.
ఈ క్రమంలో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం రాహుల్ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లాడు. అక్కడ మరోసారి విహాన్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విహాన్ శనివారం రాత్రి గుండెపోటుకు గురై చనిపోయాడు. వైద్య పరీక్షల్లో విహాన్ కు మయోకార్డిటిస్ అనే వైరస్ సోకినట్లు గుర్తించామని డాక్టర్లు చెప్పారు. ఈ వైరస్ గుండె కండరాలపై ప్రభావం చూపుతుందని, కండరాల వాపునకు కారణమవుతుందని వివరించారు. దీంతో గుండెకు రక్తం సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయని, ఫలితంగా గుండె అకస్మాత్తుగా ఆగిపోతుందని డాక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్‌కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్‌కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







