సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం జగన్

- November 28, 2023 , by Maagulf
సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. మంగళవారం సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇది కాకుండా పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పై అవగాహనా ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటిని పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com