క్యారెట్ ఎగ్ బుర్జి
- June 27, 2015
క్యారెట్ - ఒకటి
ఎగ్స్ - రెండు
ఉల్లిపాయలు - మూడు
పచ్చిమిర్చి - రెండు
పుదీనా - రెండు కొమ్మలు
కరివేపాకు - కొద్దిగా
జీలకర్ర - అర టీ స్పూను
నువ్వుల పొడి - ఒక చెంచా
కారం - ఒక చెంచా
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారీ విధానం:
క్యారెట్ను సన్నగా తురుమి ఉంచాలి. ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేసి కొంచెం వేగాక, క్యారెట్ తురుము కూడా వేసి బాగా వేయించాలి. తరువాత పుదీనా తురుము, నువ్వుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఎగ్ కూడా వేసి బాగా వేయించి, పొడిపొడిగా అయ్యే వరకూ వేయించి స్టవ్ అపాలి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే క్యారెట్ ఎగ్ బుర్జి రెడీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







