కాజల్ ఇంకొన్నాళ్లు హీరోయిన్‌గా పక్కా.!

- November 29, 2023 , by Maagulf
కాజల్ ఇంకొన్నాళ్లు హీరోయిన్‌గా పక్కా.!

‘భగవంత్ కేసరి’లో కాజల్ అగర్వాల్‌కి మంచి రోల్ దక్కింది. సైకియాట్రిస్ట్ కాత్యాయని పాత్రలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో కాజల్ చక్కగా ఒదిగిపోయింది. కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ బాలయ్యకు సరిజోడీగా వయసుకు తగ్గ పాత్రలా అనిపించింది.

ఇంతవరకూ గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన కాజల్ అగర్వాల్ ఇకపై ప్రాధాన్యత వున్న పాత్రల్లో ఎలా మెప్పించగలదో అన్న ప్రశ్నకు ఈ సినిమాతో చక్కగా సమాధానమిచ్చేసింది కాజల్ అగర్వాల్.

డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాజల్ అగర్వాల్‌ని అలా వాడాడు మరి. ఇదిలా వుంటే, బాలయ్య, కాజల్ జోడీ చూశాకా, చిరంజీవి సరసన కూడా కాజల్ అగర్వాల్ బాగుంటుందని ఓ అంచనాకి వచ్చేశారు అభిమానులు.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాకి హీరోయిన్ అవసరం వుంది. పలువురు సీనియర్ భామల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ, ఫైనల్ చేయలేదు.

ఎలాగూ ‘ఆచార్య’ మిస్ అయ్యింది కాబట్టి, కాజల్‌ని ‘విశ్వంభర (వర్కింగ్ టైటిల్)’ కోసం తీసుకుంటే బాగానే వుంటుందనేది ప్రేక్షకుల అభిప్రాయం. చూడాలి మరి, చిత్ర యూనిట్ ఈ కాంబో పట్ల ఎలాంటి ఆలోచన చేయనుందో.! అన్నట్లు చిరంజీవితో ఛాన్స్ వస్తే.. ఠక్కున అందుకోవడానికి కాజల్ రెడీగా వుందట.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com