నిద్రలేమి గల కారణాలు ..

- May 26, 2016 , by Maagulf
నిద్రలేమి గల కారణాలు ..

ఆహారపుటలవాట్లూ.. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిని నిద్రలేమి బాధిస్తుంది. అలాంటి వారు ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.కొబ్బరి నీళ్లు: పొటాషియం, మెగ్నీషియం నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కండరాలను ఉత్తేజితం చేస్తాయి. అలానే కొబ్బరి నీళ్లలోని విటమిన్‌ బి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకోవడానికి ఓ రెండు గంటల ముందు నీళ్లను తాగడం మంచిది.
గ్రీన్‌ టీ: అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభించే గ్రీన్‌ టీ హాయి నిద్రకు కారణమవుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తగ్గించి.. ఒత్తిడినీ దూరం చేస్తాయి. త్వరగా నిద్రపట్టేందుకు గ్రీన్‌టీలోని పోషకాలు దోహదం చేస్తాయి.లెమన్‌ టీ: గ్లాసు వేణ్నీళ్లలో నిమ్మరసం, అల్లం ముక్కలు, తేనె వేసి బాగా మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగితే చక్కగా నిద్రపడుతుంది.సబ్జా గింజలు: వేసవి తాపాన్ని తీర్చే సబ్జాగింజలు.. ఒత్తిడిని దూరంగా చేసి నిద్రపట్టడానికి దోహదం చేస్తాయి. ఈ గింజల్ని ఉడికించి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టాలి. మరుసటి రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్లలో కలుపుకుని తాగితే మంచిది.పాలు: గోరువెచ్చని పాలలో తేనె, బాదం పొడి, వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. తేనె బాదం వల్ల శరీరానికి అమినో ఆమ్లాలు అందుతాయి. అవి ఒత్తిడినీ, చిరాకులను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com