సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు..
- November 29, 2023
హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు పయనం అయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామాలకు వెళ్తున్నారు. ఉపాధి, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది.
తెలంగాణలో రేపు(నవంబర్ 30) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఓటు వేసేందుకు నగరంలో ఉంటున్న వారు సొంత ఊళ్లకు పయనం అయ్యారు. వేర్వేరు పనుల నిమిత్తం అనేక మంది హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్నా ఓటు హక్కు మాత్రం సొంత ఊరిలోనే ఉంది. దీంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు జనం.
సహజంగా పండుగల సమయంలో మాత్రమే హైదరాబాద్ లో ఉండే వారంతా సొంతూళ్లకు వెళ్తారు. పండుగల సమయంలో మాత్రమే రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. అయితే ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు పల్లెబాట పడతారు. ఈసారి కూడా నగరంలో ఉంటున్న వారు తమ ఊళ్లకు పయనం అయ్యారు.
సహజంగానే ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొంత టైట్ సిచువేషన్ ఉంటుంది. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు బస్సులను వినియోగిస్తూనే మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీలో తిరిగే బస్సులను కూడా జిల్లాలకు మళ్లిస్తున్నారు అధికారులు.
”ప్రతిరోజూ ఎంజీబీఎస్ నుంచి 3వేల 500 బస్సులు వెళ్తుంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనంగా వెయ్యి బస్సు సర్వీసులు ప్లాన్ చేశాము. సుమారు 4వేల 500 బస్సులు ప్లాన్ చేశాం. మహబూబ్ నగర్, ఖమ్మం సెక్టార్ కు వచ్చే సరికి హెవీ ట్రాఫిక్ ఉంది. దాని కోసం సిటీ నుంచి 62 బస్సులు అదనంగా పంపించాం. వీలైనంత తొందరగా బస్టాండ్ ల నుంచి ప్రయాణికులను వారి వారి సొంతూళ్లకు పంపేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సిబ్బంది అంతా పని చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. సుమారుగా 3లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం చేస్తారని అంచనా వేశాము” అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







