అబుదాబిలో డ్రైవర్‌కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- June 29, 2026
యూఏఈ: తన ప్రాణాలకు, ఇతర వాహనదారుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు అబుదాబికి చెందిన ఒక వాహనదారుడికి అబుదాబి క్రిమినల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, 50,000 దిర్హమ్ల జరిమానా విధించారు.
జైలు శిక్ష మరియు జరిమానాతో పాటు, నేరంలో ఉపయోగించిన కారు వేరొకరికి చెందినదని నిర్ధారణ అయినందున, ఆ వాహనం అంచనా విలువ అయిన 20,000 దిర్హమ్లను చెల్లించాలని కోర్టు డ్రైవర్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం ఆర్థిక జరిమానా 70,000 దిర్హమ్లకు చేరింది. అతను తన జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అమలులోకి వచ్చేలా, కోర్టు అతని డ్రైవర్ లైసెన్స్‌ను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది.
వాహనదారులు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలను కచ్చితంగా పాటించాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరియు ఇతర ప్రమాదకరమైన పద్ధతులు హానికరమైన ప్రవర్తన కిందకు వస్తాయని, ఇవి రుజువైతే కఠినమైన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







