AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్‌ల ఆవిష్కరణ

- December 02, 2023 , by Maagulf
AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్‌ల ఆవిష్కరణ

దోహా: దోహాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా కప్ ఖతార్ 2023 కోసం మస్కట్‌లను ఆవిష్కరించారు. AFC ఆసియా కప్ ఖతార్ 2023 లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (LOC) మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హసన్ అల్ కువారి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం టోర్నమెంట్ ఎడిషన్‌కు మస్కట్‌లు ఖతార్ కు తిరిగి రావడం మెగా క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడంలో సుదీర్ఘ వారసత్వానికి నిదర్శనం అన్నారు. కటారా స్టూడియోస్ నిర్మించిన యానిమే-ప్రేరేపిత యానిమేషన్ ద్వారా AFC ఆసియా కప్ ఖతార్ 2023 కోసం పాత్రలకు జీవం పోశారని తెలిపారు. టోర్నమెంట్ 2024 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 మధ్య జరిగనుంది. ఈ యానిమేషన్‌కు ఫహద్ అల్ కువారి దర్శకత్వం వహించారు. ఈ పాటను ఖతారీ కళాకారుడు డానా అల్ మీర్ మరియు లెజెండరీ తారెక్ అల్ అరబీ టూర్‌గేన్ ప్రదర్శించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com