హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- December 02, 2023
హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) 2023 డిసెంబర్ 1 న హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులను ప్రారంభించింది. తొలి ఇండిగో విమానం 6ఈ 7534 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 10.35 గంటలకు బయలుదేరింది. ఇండిగో బృందంతో పాటు జీహెచ్ఐఏఎల్ కు చెందిన ఉన్నతాధికారులు ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రోజువారీ విమానం హైదరాబాద్ నుంచి 10:35 గంటలకు బయలుదేరి 12:35 గంటలకు గోండియా చేరుకుంటుంది. రైస్ సిటీ అని కూడా పిలువబడే గోండియాను ఇండిగో నెట్వర్క్కు చేర్చడం ఎయిర్ లైన్స్ యొక్క కొనసాగుతున్న విస్తరణను సూచిస్తుంది. దీనితో ఇండిగో హైదరాబాద్ ను 55 దేశీయ గమ్యస్థానాలకు మరియు 14 అంతర్జాతీయ గమ్యస్థానాలకు కలుపుతుంది.
.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







