'శభాష్‌ నాయుడు' లోకమల్‌హాసన్‌..

- May 26, 2016 , by Maagulf
'శభాష్‌ నాయుడు' లోకమల్‌హాసన్‌..

 రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, లైకా సంస్థ సంయుక్తంగా 'విశ్వ కథానాయకుడు' కమల్‌హాసన్‌ నటిస్తున్న చిత్రం 'శభాష్‌ నాయుడు'. టీకే రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సహాయ దర్శకురాలిగా కమల్‌ రెండో కుమార్తె అక్షర వ్యవహరిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. 1989లో రాజీవ్‌కుమార్‌ దర్శకత్వంలో కమల్‌ నటించారు. ఇప్పుడు దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. మే 16న లాస్‌ ఏంజెల్స్‌లో చిత్రీకరణ ఆరంభం కానుందని కమల్‌ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్రయూనిట్‌, కమల్‌హాసన్‌ అమెరికా చేరుకున్నారు. దీనిగురించి కమల్‌ స్పందిస్తూ.. కొన్ని సమస్యలను ఎదుర్కొని ప్రస్తుతం అమెరికా చేరుకున్నాం. ఇందుకు చెన్నైలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఎంతో సహకరించింది. మూడు భాషల స్క్రిప్టుతో ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌ చేరుకున్నామని సంతోషాన్ని పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com