స్విమ్మింగ్ పూల్లో మునిగి ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- December 05, 2023
కువైట్: కువైట్లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి యునైటెడ్ స్టేట్స్కు పాఠశాల పర్యటన సందర్భంగా హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన రెండు వారాల క్రితం జరిగింది. 18 ఏళ్ల సహాయ జెబాస్ ప్రజోప్ - ఇండియన్ సెంట్రల్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓర్లాండోలో వారు బస చేసిన హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. పాఠశాల ఏర్పాటు చేసిన నాసా అధ్యయన పర్యటనలో భాగంగా అతను అమెరికా వెళ్లాడు. సహాయ జెబాస్ ప్రజోప్ కుటుంబం తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అతని తండ్రి సహాయ థామస్ రూపన్ ఖరాఫీ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. తల్లి వనిత విన్సీ టాలీ గ్రూప్లో పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







