హజ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం
- December 06, 2023
యూఏఈ: హజ్ 2024 కోసం యూఏఈ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది. ఈ మేరకు ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అధికారులు మంగళవారం సూచించారు. జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ (Awqaf) యాత్రికులు డిసెంబర్ 21 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుందని, స్లాట్‌లు కూడా పరిమితం, కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సౌదీ అరేబియా వచ్చే ఏడాది జూన్‌లో ఇస్లాం పవిత్ర స్థలాలకు యాత్రికులను స్వాగతిస్తుంది. మొదటి బ్యాచ్ మేలో వస్తుందని భావిస్తున్నారు. Awqaf UAE స్మార్ట్ యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, యాప్‌ను తెరిచి, 'హజ్ పర్మిట్ సర్వీస్' ఎంపికను ఆ తర్వాత యూఏఈ పాస్ (డిజిటల్ ID)తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ విధానాలను అనుసరించి ఫారాన్ని పూర్తి చేశారు. అన్ని వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించున్న తర్వాత సడ్మిట్ చేయాలి. సాధారణంగా, యూఏఈ ఎమిరాటీస్‌కు మాత్రమే హజ్ అనుమతులను జారీ చేస్తుంది. ప్రవాసులు తమ స్వదేశాల కోటా, ఇతర విధానాల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. యాత్రికులు సాధారణంగా లైసెన్స్ పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారా తీర్థయాత్రకు వెళతారు. వీటి జాబితా జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆపరేటర్లు వీసా ఖర్చులు, హోటళ్లు, రవాణా మరియు ఆహారాన్ని చూసుకునే అన్ని హజ్ ప్యాకేజీలను అందిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







