మారుతి సుజుకీ మరోసారి వేల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది..
- May 27, 2016
కార్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి వేల సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపిస్తోంది. బాలెనో పేరుతో ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో దూసుకువచ్చిన మారుతి సుమారు 75వేల బాలెనో రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. కార్ల మార్కెట్ లో నెలకొన్న పోటీని తట్టుకునేందుకు వీలుగా తన కార్లను వరుసగా అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్న మారుతి తాజాగా తన సరికొత్త మోడల్ బాలెనో 75,419 కాలర్లను వెనక్కి రప్పించనుంది. ఈ మోడల్ కార్లలో ఎయిర్ బ్యాగ్ సాఫ్ట్ వేర్ ను పునర్వవస్థీకరించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. 0.5 శాతం నష్టాలను నమోదు చేసింది.కాగా ఇటీవల మారుతి ఆల్టో 800 కార్లలో ఎయిర్ బ్యాగ్ సౌకర్యాన్ని కల్పించి సరికొత్తగా ముస్తాబు చేసి అందుబాటు ధరల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







