PPP మోడ్‌లో అత్యంత లాభదాయక విమానాశ్రయంగా బెంగళూరు
- December 07, 2023
న్యూఢిల్లీ: బెంగళూరు విమానాశ్రయం 2022-2023లో రూ. 528.3 కోట్ల లాభాన్ని ఆర్జించి, భారతదేశంలో అత్యంత లాభదాయకమైన విమానాశ్రయంగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో తెలిపారు. 2022-2023లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడ్‌లో ఉన్న 14 విమానాశ్రయాలలో మూడు మాత్రమే లాభాల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. 2022-2023లో రూ. 267.1 కోట్ల లాభంతో కొచ్చిన్ విమానాశ్రయం రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్ రూ. 32.9 కోట్ల లాభాలతో మూడో స్థానంలో నిలిచింది. 2022-2023లో అహ్మదాబాద్ విమానాశ్రయం అత్యధికంగా రూ. 408.51 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఢిల్లీ (రూ. 284.8 నష్టం), లక్నో (రూ. 160.6 కోట్ల నష్టం), మోపా (రూ. 148.3 కోట్ల నష్టం), కన్నూర్ (రూ. 131.9 కోట్ల నష్టం), జైపూర్ (రూ. రూ. 128.5 కోట్ల నష్టం), మంగళూరు (రూ. 125.9 కోట్ల నష్టం), తిరువనంతపురం (రూ. 110.1 కోట్ల నష్టం), గౌహతి (రూ. 60.9 కోట్ల నష్టం), దుర్గాపూర్ (రూ. 9.1 కోట్ల నష్టం), ముంబై (రూ. 1.04 కోట్ల నష్టం) చవిచూశాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తున్న 125 విమానాశ్రయాలలో కోల్‌కతా రూ. 482.3 కోట్లతో అత్యంత లాభదాయకంగా నిలిచింది. ఆ తర్వాత చెన్నై (రూ. 169.5 కోట్లు), కాలికట్ (రూ. 95.3 కోట్లు), తిరుచిరాపల్లి (రూ. 31.5 కోట్లు), కోయంబత్తూర్ (రూ. 12.6 కోట్లు), భువనేశ్వర్ (రూ. 11.8 కోట్లు), చండీగఢ్ (రూ. 9.5 కోట్లు), బాగ్డోగ్రా (రూ. 2.7 కోట్లు), అసన్సోల్ (రూ. 2 కోట్లు), లేహ్ (రూ. 1.8 కోట్లు), కాన్పూర్ చకేరీ (రూ. 1.4 కోట్లు) మరియు దర్భంగా (రూ. 1.1 కోట్లు) ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని 25 విమానాశ్రయాలను 2022 మరియు 2025 మధ్య కాలానికి లీజుకు ఇవ్వడానికి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్‌పూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మధురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంఫాల్, అగర్తల, ఉదయపూర్, డెహ్రాడూన్ మరియు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష