కేసీఆర్ ఆరోగ్యం పై సీఎం రేవంత్ ఆరా..
- December 08, 2023
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయనకు అందుతున్న వైద్యం గురించి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలిపారు.
వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించంది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది.
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే సెక్రటేరియట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ శాఖపై అత్యున్నత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







