పవర్, వాటర్ పొదుపుకి 'దెవా' బహుమతి
- May 27, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా) వినియోగదారులకు బహుమతులు ఇవ్వనుంది. అయితే ఈ బహుమతులు అందుకోవడానికి వినియోగదారులు నీటిని, విద్యుత్‌ని ఆదా చెయ్యవలసి ఉంటుంది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 2016 లోపు తమ ఎలక్ట్రిసిటీ బిల్లులపై 15 శాతం కనీసం ఆదా చేయగలిగినవారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. అలా అర్హత సాధించినవారిలో కొందరిని ఎంపిక చేసి బహుమతులు, ఓ ప్రశంసా పత్రం అందజేయబడతాయి. బహుమతులు 15,000 దిర్హామ్‌లు (ఫస్ట్ ప్లేస్), 10,000 (రెండో ప్లేస్), 5,000 (మూడో ప్లేస్) గా నిర్ణయించారు. రెండు కేటగిరీల్లో ఈ బహుమతుల్ని అందజేస్తారు. వినియోగదారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు దెవా వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓ టీమ్, వినియోగదారుల బిల్లుల్ని పర్యవేక్షిస్తుంది. గత ఏడాదితో ఈ ఏడాది బిల్లుల్ని ఈ టీమ్ పోల్చి చూస్తుంది. గత సంవత్సరం 6,008 వినియోగదారులు ఈ పోటీలో పాల్గొని 3 మిలియన్ కెడబ్ల్యుహెచ్ విద్యుత్‌ని, 29 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేశారు
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







