ఖతార్ పబ్లిక్ సెక్టార్లో ఐదు గంటల పనిదినాలు
- May 27, 2016
ఖతార్ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు రంజాన్ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తారని అధికారులు వెల్లడించారు. జూన్ 5 నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కానుంది. అయితే రోజుకి ఐదు గంటల పనిదినాలు ప్రైవేటు కంపెనీలకు వర్తించవు. ఖతారీ చట్టం ప్రకారం ఈ సంస్థలు రోజుకి 6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఇండిపెండెంట్ స్కూల్స్ ఇప్పటికే పని గంటల్ని తగ్గించాయి. మే 15 నుంచి ప్రభుత్వ కిండర్‌గార్టెన్స్ ఉదయం 11 గంటలకు పూర్తయిపోతాయి. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్‌కి 11.45 నిమిషాల వరకు, సెకెండరీ స్టూడెంట్స్ 12.35 గంటలకు పూర్తవుతుంది. ఈసారి గతంలోకన్నా భిన్నంగా సమ్మర్ హాలీడేస్ చాలా ఎక్కువగా లభించనున్నాయి. రంజాన్ సెలవులతో కలుపుకుంటే లాంగ్ సమ్మర్ హాలిడేస్ ఉండనున్నట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







