టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. సోమవారం జనార్దన్ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో గవర్నర్ తమిళిసై ఉన్నారు.
కాగా, ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బాధ్యులు ఎవరో తెలియకుండా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకులకు బాధ్యులను చేస్తూ డీవోపీటీకి గవర్నర్ లేఖ రాయడంతో తమిళి సౌ సౌందర్ రాజన్ ప్రశ్నాపత్రం లీకేజీలో బాధ్యులెవరో తెలిసేంత వరకూ రాజీనామాను ఆమోదించకూడదని నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







