'రైట్ రైట్'కు సెన్సార్ క్లీన్ 'యు' సర్టిఫికెట్
- May 27, 2016
క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం `రైట్ రైట్`. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ సరసన పూజా జవేరి నాయికగా నటించారు. బాహుబలి` ఫేమ్ ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ 'క్లీన్ యు' సర్టిఫికెట్ ఇచ్చింది. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ - "ఓ బస్సు నేపథ్యంలో సాగే చిత్రం ఇది. అనుకోకుండా బస్ కండక్టర్ అయిన ఓ కుర్రాడికి ఓ మిస్ తారసపడుతుంది. ఆ మిస్సుతో బస్ కండక్టర్ కి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? అనేది కథ. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. చాలా న్యాచురల్ మూవీ. సుమంత్ అశ్విన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. తన కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రింట్లతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటివరకూ సుమంత్ అశ్విన్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఈ చిత్రంలో చేశారు. 'బాహుబలి' ఫేమ్ ప్రభాకర్ చేసిన పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. అన్ని వర్గాలవారూ చూడదగ్గ మంచి చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
నాజర్, ధనరాజ్, `షకలక` శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: `డార్లింగ్` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







