చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి ధ్వజం
- May 27, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీని చంద్రబాబు నక్కల పాలు, కుక్కల పాలు చేశారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత శనివారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరమై పోయిందని, పార్టీ విధానాలను చంద్రబాబు భూస్థాపితం చేశారని ఆమె విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి చిట్టా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉందని, ఓటుకు నోటు కేసు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతిలో ఉందని, దీంతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై గానీ జలాలపై గానీ పోరాటం చేయలేరని ఆమె అన్నారు.కేవలం పార్టీ పేరు చెప్పుకుని చంద్రబాబు బతుకున్నారని, ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించడానికి వీలు లేని స్థితికి పార్టీని దిగజార్చారని ఆమె అన్నారు.తిరుపతి టౌన్ క్లబ్ సెంటర్లో చంద్రబాబు, బాలకృష్ణ, బొజ్జల గోపాల కృష్ణారెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ అహర్నిశలు కృషి చేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







