అర్జెంటీనాలో తుఫాన్ బీభత్సం…13 మంది మృతి
- December 17, 2023
అర్జెంటీనా: అర్జెంటీనాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ ధాటికి భవనం పైకప్పు కుప్పకూలి 13 మంది మృతి చెందారు. భీకర తుఫాన్ కు స్పోర్ట్స్ క్లబ్ పైకప్పు కూలిపోయింది. మేయర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫార నిలిచిపోయింది.
దురదృష్టవశాత్తూ బహియన్స్ డెల్ నోర్టే క్లబ్లో ఉన్న 13 మంది మృతి చెందినట్లు అత్యవసర సేవ తెలిపినట్లు మున్సిపాలిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







