హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
- December 18, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు.
మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు. పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రేమ్ చంద్ తన బర్త్ డే రోజున 30మంది ఫ్రెండ్స్ కోసం డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. సంపత్.. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసి పార్టీకి ప్లాన్ చేశారు.
అశోక్ యాదవ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు మైత్రీవనం వద్ద నిఘా ఉంచారు. డ్రగ్స్ విక్రయించడానికి అశోక్ ప్రయత్నిస్తుండగా మైత్రీవనం దగ్గర పోలీసులు అశోక్ ను పట్టుకున్నారు. విచారణలో అతడిచ్చిన సమాచారం ఆధారంగా రాజేశ్, సాయి చరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ ది నెల్లూరు జిల్లా. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అమీర్ పేట్ లో హాస్టల్ లో ఉంటున్నాడు. నిందితులు ముగ్గురు గోవాకు పలుమార్లు వెళ్లారు. అదే సమయంలో డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.
నగరంలో డ్రగ్స్ కున్న డిమాండ్ ను బట్టి సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ విక్రయించాలని నిర్ణయించారు. గోవాలో బాబా అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు నిందితులు. ఒక్కో సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్ వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి నగరంలో రూ.2500కు విక్రయిస్తోంది రాజేశ్ అండ్ గ్యాంగ్. నిందితులు హైదరాబాద్ తో పాటు నెల్లూరులో కూడా పిల్స్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. న్యూ ఇయర్ సందర్భంగా సాయి చరణ్ 60 సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







