IPL 2024: మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం?
- December 18, 2023
దుబాయ్: దుబాయ్ లో మరికొన్ని గంట్లలో ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన ప్రారంభ తేదిని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 22 నుంచి మే చివరి వరకు షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఫిక్స్ చేసినట్లుగా ఆ వార్తల సారాంశం. సోమవారం బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అయ్యాయని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ తెలిపింది.
ఇందులో ఐపీఎల్ 2024 షెడ్యూల్ తో పాటు విదేశీ ఆటగాళ్లు ఎంత మంది సీజన్‌కు అందుబాటులో ఉంటారనే విషయాలను చర్చించినట్లు కథనంలో పేర్కొంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంక దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నారని తెలిపింది.
అయితే.. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత దానికి అనుగుణంగా ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మంగళవారం ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. ఇప్పటికే వేలానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వేలం జరగనుంది.
10 ఫ్రాంచైజీల్లో కలిపి 77 స్లాట్స్ అందుబాటులో ఉండగా 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు.వేలం ప్రక్రియను టీవీల్లో స్టార్‌స్పోర్ట్స్, ఓటీటీలో జియో సినిమాస్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







