2017 నాటికి మెటల్ సిలెండర్లు ఔట్
- May 28, 2016
ఖతార్ ఫ్యూయెల్ (వకూద్) ప్రస్తుతం ఉన్న మెటల్ గ్యాస్ సిలెండర్లను పూర్తిగా తొలగించి, ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలెండర్లను అందుబాటులోకి తీసుకురానుంది. 2017 మధ్యలో ఈ ప్లాస్టిక్ సిలెండర్లు అందుబాటులోకి రావొచ్చని వకూద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇబ్రహీమ్ జహమ్ అల్ కువారి చెప్పారు. ప్లాస్టిక్ సిలెండర్లపై అవగాహనా కార్యక్రమాల్ని కూడా కొనసాగించనున్నట్లు చెప్పారాయన. ఇప్పటికే చాలా వరకు షఫాఫ్ సిలెండర్లు (ట్రాన్సపరెంట్ ప్లాస్టిక్) అందుబాటులోకి వచ్చాయి. షఫాప్ సిలెండర్లు, మెటల్ సిలెండర్లతో పోల్చితే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయనీ, పేలుడు అవకాశాలు చాలా తక్కువని అన్నారు. మెటల్ సిలెండర్ల బరువు 12 కిలోలు కాగా, ప్లాస్టిక్ సిలెండర్లు కేవలం 5 కిలోల బరువు మాత్రమే ఉంటాయని వివరించారాయన. ట్రాన్స్‌పరెంట్‌గా సిలెండర్లు ఉంటాయి గనుక, గ్యాస్ ఎంత ఉందో తెలుసుకునేందుకు వీలవుతుంది. వకూద్, 100 ఖతారీ రియాల్స్ కాంపన్సేషన్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







