యువ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను అందివ్వాలి: ఇస్రో డైరెక్టర్‌ శ్రీకాంత్‌

- December 19, 2023 , by Maagulf
యువ శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను అందివ్వాలి: ఇస్రో డైరెక్టర్‌ శ్రీకాంత్‌

హైదరాబాద్: మనవ జీవన ప్రయాణం సాంకేతికతతోనే ఆరంభమవుతుందని చంద్రయాన్‌-3 మిషన్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అన్నారు.

చంద్రయాన్‌-3తో ప్రపంచ దేశాలకు ఇస్రో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో సోమవారం సెన్సార్‌ టెక్నాలజీపై 16వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్‌ మాట్లాడుతూ..యువ శాస్త్రవేత్తలు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రపంచానికి సాంకేతికతను అందించాలని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఫైబర్‌ ఆప్టిక్‌ గైరోస్కోప్‌ ఆధారిత సెన్సార్‌ ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సెన్సింగ్‌ టెక్నాలజీ డొమైన్‌ పనిచేసే విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌ పిలానీ వైస్‌ చాన్సలర్‌ రాంగోపాల్‌రావు, బిట్స్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com