ఆ ఒక్క సెకను ఎలా గడపాలో ఆలోచించారా?
- June 28, 2015
ఒక రోజుకు ఎన్నిగంటలు, ఎన్ని నిమిషాలు అంటే కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా చెప్పేస్తారు? రోజుకు ఎన్ని సెకన్లు ఉంటాయని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జూన్ 30వ తేదీ మన దీర్ఘకాలిక జ్ఞాపకంలో చెరగని ముద్ర వేసే అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 86, 400 సెకన్లు. కాగా, ఈ జూన్ 30 మాత్రం మామూలు రోజుకన్నా కాస్త ఎక్కువగా ఉంటుందట. జూన్ 30 వ తేదీకి అదనంగా ఒక లీపు సెకను ఎందుకు జోడించాల్సి వచ్చిందో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం(నాసా) వెల్లడించింది. సూర్యని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణ కాస్త తగ్గుతూ ఉండటంతో ఆ లోటును భర్తీ చేయడానికి అదనంగా ఒక లీపు సెకనును జోడించినట్లు నాసా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యుటిసిగా పికోర్డినేటెడ్ యూనివర్సల్ టైమింగ్ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యుటిసి అనేది ఆటోమేటిక్ టైమ్. ఈ కచ్చితమైన సమయం ఇప్పుడు తెలియకపోయినా.. 14,00,000 సంవత్సరాలకు ఒకసారి సమయ మార్పు తెలిసే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సూర్యని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం తగ్గుతూ రావడంతో ఇలా ఒక సెకను అదనంగా జోడించాల్సి వచ్చిందట. దీంతో జూన్ 30 వ తేదీకి 86, 401 సెకన్లుగా నిర్ణయించాల్సి వచ్చిందని నాసా తెలిపింది. ఒక రోజు 23:59:59 సెకన్ల వద్ద ముగిసి 00:00:00తో ప్రారంభమవుతుంది. జూన్ 30 వ తేదీన 23:59:60 సెకన్ల వద్ద ముగిసి 00:00:00 తో ఆరంభం కానుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ జూన్ వరకూ చూస్తే ఇలా లీపు సెకను పెంచడం నాల్గోసారి.ఆరోజు నుంచి గడియారాల్లో ఒక సెకనును అదనంగా పెంచుకుందామా మరి.ఆ ఒక్క సెకను ఎలా గడపాలో ఆలోచించండి.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







