ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 916 కంపెనీలు
- December 19, 2023
యూఏఈ: 2022 మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 916 కంపెనీలు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాయి. ఉల్లంఘనలలో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను అధిగమించే బోగస్ పద్ధతులను అవలంబించాయి. ఈ కంపెనీలు మొత్తం 1,411 యూఏఈ జాతీయులను నియమించుకున్నాయి.50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలకు 2023లో తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించింది. డిసెంబరు నెలాఖరులోపు నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎమిరాటీలను 2 శాతం వృద్ధిని నమోదు చెయ్యాలి. కానీ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను తప్పించుకోవడానికి లేదా బోగస్ ఉద్యోగాలను సదర్ కంపెనీలు చూపెట్టి నిబంధనలను ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం 2 శాతం ఎమిరాటీలను తమ వర్క్‌ఫోర్స్‌లో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







