ఇల్లీగల్ మైగ్రేషన్.. అంతర్జాతీయ నేరస్థుల ముఠా అరెస్ట్
- December 20, 2023
యూఏఈ: దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మంగళవారం కొన్ని యూరోపియన్ దేశాలకు అక్రమ వలస కార్యకలాపాలలో ఉన్న అంతర్జాతీయ ముఠాను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల సమగ్ర డేటాబేస్ సమాచారాన్ని సేకరించడానికి రూపొందించిన ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో క్రిమినల్ ముఠా సభ్యులను గుర్తించినట్లు దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు. అధునాతన డిజిటల్ వ్యవస్థలను అమలు చేయడం, సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు సమాఖ్య సంస్థలతో సన్నిహిత సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ అల్ మర్రి చెప్పారు.
ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేసి ముఠా సభ్యులందరినీ వేగంగా అరెస్టు చేసినట్లు, వారిని అబుదాబిలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







