తేజ సజ్జా.! నన్ను చిన్న చూపు చూడొద్దు ప్లీజ్.!
- December 20, 2023
ఇంద్ర సేనా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి పాత్రలో కనిపించి మెప్పించిన బుడ్డోడు తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు. చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించాడు.
చిన్నతనం నుంచీ సినిమాల్లోనూ వుంటూ కష్టపడి హీరోగా ఎదిగాడు. ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగానూ ఓ మంచి హిట్ కొట్టేశాడు. ఇప్పుడు ‘హనుమ్యాన్’ గా రాబోతున్నాడు.
విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు.
రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూస్తే, ఇది హిట్టు బొమ్మ అని ఫిక్సయిపోయారో ఏమో.. రకరకాల ప్రశ్నలతో పాపం తేజ సజ్జాని వేధిస్తున్నారు.
ఈ సినిమాకి నీ స్టామినా సరిపోతుందా.? అంటూ అవమానపరిచేలా మాట్లాడుతున్నారు. దాంతో, బుడ్డోడు బాగా హర్ట్ అయ్యాడు. స్టార్ హీరోల వారసుల్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా.?
చిన్నతనం నుంచీ ఎంతో కష్టపడి నేను ఈ స్టేజ్‌కి వచ్చాను. అదృష్టం కొద్దీ, నాకు ఈ సినిమా ఛాన్స్ దక్కింది. లక్కు బాగుండి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నటుడికి స్టామినాతో పనేముంది.? చిన్న హీరోలు పెద్ద సినిమాలు చేయడకూడదన్న రూలేమైనా వుందా.? పెద్ద సినిమాలన్నీ స్టార్ హీరోలూ, వారి వారసులే చేయాలా.? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ‘హనుమ్యాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







