ఖతార్ హయ్యా వీసా చెల్లుబాటు గడువు పొడిగింపు

- December 21, 2023 , by Maagulf
ఖతార్ హయ్యా వీసా చెల్లుబాటు గడువు పొడిగింపు

దోహా: హయా వీసా చెల్లుబాటు గడువును ఫిబ్రవరి 24, 2024 వరకు పొడిగిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్ రాష్ట్రం నిర్వహించే అతిపెద్ద క్రీడా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలకు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు,  సందర్శకుల రాకను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో పేర్కొంది., అంతర్గత మంత్రిత్వ శాఖ, హయ్యా ప్లాట్‌ఫారమ్‌తో భాగస్వామ్యంతో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానుల కోసం హయ్యా వీసా కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీసా హోల్డర్‌ల కోసం చివరి ప్రవేశం ఫిబ్రవరి 10 న ఉంటుందని, ఇది వారికి ఖతార్‌ను సందర్శించడానికి మరియు AFC ఆసియా కప్ ఖతార్, ఈ కాలంలో దేశం నిర్వహించే ఇతర ఈవెంట్‌లను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపింది. మరింత సమాచారం కోసం హయ్యా ప్లాట్‌ఫారమ్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com