ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్రెడ్డి భేటీ..
- December 26, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు ఏయే విషయాలపై చర్చించామన్న వివరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సిందిగా మోదీని కోరామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను అడిగామనన్నారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా మోదీని కలిశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెచ్చుకున్నామని అన్నారు. ఈ మూడు విషయాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కారు నిధులు తీసుకురాలేకపోయిందని భట్టి విక్రమార్క అన్నారు. తాము విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు.
అలాగే, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి విజ్ఞప్తులు చేశామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని అన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







