హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- June 28, 2026
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG చైర్మన్ శివసేనా రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.అలాగే ప్రముఖ సినీ నటుడు Chiranjeevi కూడా హాజరై మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
విజేత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీని అందజేసి అభినందనలు తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను కొనియాడుతూ, తెలంగాణలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫైనల్ పోటీకి భారీ సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. గచ్చిబౌలి స్టేడియం క్రీడాస్ఫూర్తి, ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







